సత్యరాజ్, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నయన్‌ ‘కనెక్ట్‌’, ఫస్ట్‌లుక్‌ అవుట్‌ | Nayanthara New movie is Connect is Release Soon | Sakshi
Sakshi News home page

Nayanthara: సత్యరాజ్, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నయన్‌ ‘కనెక్ట్‌’, ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Oct 28 2022 12:50 PM | Updated on Oct 28 2022 12:50 PM

Nayanthara New movie is Connect is Release Soon - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార చిత్రాలకు అందరూ కనెక్ట్‌ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె కనెక్ట్‌గా మారింది. ఒక పక్క స్టార్‌ హీరోలతో నటిస్తున్న ఈమె, మరో పక్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథల్లో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇలాంటి కథా చిత్రం విడుదలయ్యేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈమె నటించిన ఓ2 చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా నయనతార కథానాయకిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి కనెక్ట్‌ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తమ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు.

కాగా కనెక్ట్‌ చిత్రంలో నయనతారకు జంటగా నటుడు వినయ్‌ నటించగా సత్యరాజ్, బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని అశ్విన్‌ శరవణన్‌ తన గత చిత్రాల తరహాలోనే తెరకెక్కించినట్లు తెలిసింది. షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే నయనతార గత చిత్రాల మాదిరిగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా? లేక థియేటర్లలో విడుదలవుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. కనెక్ట్‌ చిత్ర విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement