విఘ్నేశ్ శివన్ బర్త్‌ డే.. బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్‌! | Nayanthara Celebrates husband Vignesh Shivan birthday in Dubai | Sakshi
Sakshi News home page

Nayanthara: విఘ్నేశ్ శివన్ బర్త్‌ డే.. బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్‌!

Sep 19 2024 11:09 AM | Updated on Sep 19 2024 11:16 AM

Nayanthara Celebrates husband Vignesh Shivan birthday in Dubai

లేడీ సూపర్ స్టార్‌ నయనతార ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మ తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా భర్త బర్త్‌ డే వేడుకను దుబాయ్‌లోని  బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్ కోసం బర్త్‌ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉ‍న్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్‌ను గెలుచుకుంది.  విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్‌ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్‌ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా  'మన్నంగట్టి 1960' మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీక చిత్రానికి విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement