మొన్న 70 ఏళ్ల హీరో.. ఇప్పుడు 35 ఏళ్ల హీరో | Nayanthara And Kavin Hi Movie Kannakuzhiya Song | Sakshi
Sakshi News home page

Nayanthara: నయనతారకు మాత్రమే ఇలాంటివి సాధ్యం

Apr 21 2026 6:10 PM | Updated on Apr 21 2026 6:29 PM

Nayanthara And Kavin Hi Movie Kannakuzhiya Song

చాలామంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు గానీ నయనతార మాత్రం చాన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఇద్దరు పిల్లలు తల్లిగా మారిన తర్వాత కూడా ఈమె జోరు తగ్గట్లేదు. ఇదే కాదు మరో అంశంలోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?)

హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏ తరహా పాత్రలు చేస్తారో చాలావరకు వాటికి తగ్గట్లే అవకాశాలు వస్తుంటాయి. ఉదాహరణకు సీనియర్ హీరోలతో చేస్తే వాళ్ల సినిమాల్లో.. యంగ్ హీరోలతో చేస్తే వాళ్లతోనే అవకాశాలొస్తాయి. కానీ ఇలాంటి వాటికి నయనతార అతీతం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్, జూనియర్ అని తేడా ఉండదు. అందరూ హీరోలతోనూ కలిసి నటించేస్తుంటుంది. విచిత్రం ఏంటంటే అందరితోనూ ఈమె కెమిస్ట్రీ కూడా అలానే వర్కౌట్ అయిపోతుంటుంది.

మూడు నెలల క్రితం 70 ఏళ్ల చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్' సినిమాలో చేసింది. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన తమిళ హీరో కవిన్‌తో జోడీ కట్టింది. 'హాయ్' పేరుతో తీస్తున్న మూవీలోనే వీళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే వీళ్ల కాంబో ఎలా ఉంటుందా అనే సందేహాలకు తొలి పాటతో సమాధానమిచ్చారు. కవిన్-నయన్ జంట చూడటానికి బాగానే ఉంది. పాట కూడా బాగుంది.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోలతో చేసిన నయనతార.. తమిళంలో రజనీకాంత్ జనరేషన్ హీరోలతో చేసింది. విజయ్, అజిత్ తదితరులతోనూ నటించింది. ప్రస్తుత జనరేషన్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. చూస్తుంటే నయనతారకు మాత్రమే ఇలాంటివి సాధ్యమేమో అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement