నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని | Nayani Pavani Emotional About Father Death Struggles | Sakshi
Sakshi News home page

Nayani Pavani: కొన్ని కామెంట్స్ చూసి చాలా బాధేసింది: నయని పావని

Published Mon, Oct 16 2023 5:55 PM | Last Updated on Mon, Oct 16 2023 7:02 PM

Nayani Pavani Emotional About Father Death Struggles - Sakshi

బిగ్ బాస్‌ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా స్టార్ నయని పావని. అయితే హౌస్‌లో అడుగుపెట్టిన వారానికే ఎలిమినేట్ అయి అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఎలిమినేషన్‌తో ఫుల్ ఎమోషనల్ అయ్యారు నయని పావని. ఏడుస్తూనే హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమినేషన్ తర్వాత ఇంటికెళ్లిన పావని.. తల్లిని చూసి కంటతడి పెట్టుకుంది. ఈ షో వల్ల నయని పావని ఇంటికొచ్చేసినప్పటికీ ఫుల్ పాపులారిటీ అయితే తెచ్చుకుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన నయని పావని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాన్న గురించి తలుచుకుంటూ ఫుల్ ఎమోషనల్ అయింది. 

(ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!)

నయని పావని మాట్లాడుతూ.. 'మా ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకునేదాన్ని. మా నాన్న చనిపోయాక ఏం చేయాలన్నా ఖర్చు అవుతుంది. అది వీళ్లేవరికి అర్థం కాదు.  కొందరు చాలా దారుణంగా మాట్లాడతారు. మీ నాన్న చనిపోయాక ఇలాంటి డ్రెస్సులు వేస్తారా? ‍అని కామెంట్స్ పెడతారు. కొందరి కామెంట్స్ చూసి నాకు చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. అసలు దానికీ, దీనికి సంబంధమేంటి? మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు, ఫోటోలు చూడకండి. ఆ సమయంలో అలాంటి కామెంట్స్ నాపై తీవ్ర ప్రభావం చూపాయి. అవీ చూసి నాకు చాలా బాధేసింది. మా ఫ్యామిలీ అంతా బాధలో ఉన్నాం. ఆ సమయంలో అందరూ ఇంత ఈజీగా ఎలా కామెంట్ చేస్తారా అనిపించింది. మాకు డబ్బులు సంపాదించాలని నాన్న ఎప్పుడూ చెప్పలేదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదని అనేవారు. నన్ను చాలా గారాభంగా పెంచారు. మా నాన్నకు సర్జరీ సమయంలో ఫ్రెండ్స్, బంధువులు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆ రోజు రాత్రి ఏడుస్తూనే ఉన్నా. నాకు ఎవరూ కాల్ చేయలేదంటీ? అని ఎంతో బాధగా అనిపించింది' అంటూ కన్నీటి పర్యంతమైంది. 

(ఇది చదవండి: బద్రి సినిమా ఇప్పుడే రిలీజైన‍ట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement