రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్ | Nawazuddin On Young Generation Useless After Liplock With Avneet Kaur | Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui: వాళ్లంతా పనికిరాని వారే.. లవ్‌, బ్రేకప్‌ అన్నీ వాట్సాప్‌లోనే: నవాజుద్దీన్

Jun 20 2023 7:23 PM | Updated on Jun 20 2023 7:33 PM

Nawazuddin On Young Generation Useless After Liplock With Avneet Kaur - Sakshi

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అవనీత్‌ కౌర్‌ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్‌ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్‌ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్‌లో హీరోయిన్‌ను నవాజుద్దీన్‌ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్‌ విమర్శలపై స్పందించారు.

(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! )

నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు.  ముఖ్యంగా ఇప్పుడున్న  బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్‌ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్‌, బ్రేకప్‌ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్‌ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని‍ కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు.

కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో  విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్‌ మాలిక్‌గా కనిపించనున్నారు.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం.!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement