పిచ్చి పిచ్చి పాటలు.. ఊహకందని సీన్స్.. సౌత్‌ సినిమాలను ఎద్దేవా చేసిన నసీరుద్దీన్

Naseeruddin Shah says South films are more imaginative than Bollywood - Sakshi

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లో సీన్స్ ఊహకందని విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు.  తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కొన్ని సీన్స్ సంబంధం లేకుండా ఉంటాయన్నారు. అలాగే పాటలు కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని విమర్శించారు. సౌత్ సినిమాల్లో అసలు లాజిక్ కొంచెం కూడా ఉండదన్నారు. సినిమాలు హిట్ అయినా కూడా స్క్రిప్ట్ తెరకెక్కించడంలో తప్పులు చేస్తారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకూ హాజరైన నసీరుద్దీన్ సౌత్ చిత్రాలపై విమర్శలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలకు ఇది కొత్తేమీ కాదని నసీరుద్దీన్ అంటున్నారు.
 
నసీరుద్దీన్ షా మాట్లాడుతూ..' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు హిట్ అయినా..  వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో కొన్ని సన‍్నివేశాలు ఊహకి అందని విధంగా ఉంటాయి. వాటిలో  పిచ్చి పిచ్చి పాటలు ఒకటి. హిట్ సినిమాలు అయినా కనీసం లాజిక్ పాటించరు. చిత్రీకరణలో చాలా లోపాలు ఉంటాయని' ఘాటుగా విమర్శించారు. ఇది చూసిన నెటిజన్లు నసీరుద్దీన్‌ షాను ట్రోల్స్ చేస్తున్నారు. 

అయితే మరోవైపు హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటున్నాయని నసీరుద్దీన్ చెప్పారు. దక్షిణాది చిత్రాలను చాలా కష్టపడి తీస్తారని.. హిందీ సినిమాల కంటే హిట్ అవుతాయనడంలో సందేహం లేదన్నారు.  అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అయితే 'కేజీఎఫ్', 'పుష్ప: ది రైజ్', కాంతార, 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి సౌత్ చిత్రాలు హిందీ చిత్రాల బాక్సాఫీస్‌ను దాటేశాయి.

కాగా.. నసీరుద్దీన్ షా..  ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కుట్టే'లో టబు, అర్జున్ కపూర్, రాధిక మదన్, కొంకణా సెన్శర్మ, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అతను తదుపరి 'తాజ్-డివైడెడ్ బై బ్లడ్' పేరుతో రాబోయే హిస్టారికల్ డ్రామా సిరీస్‌లో అక్బర్ చక్రవర్తిగా కనిపించనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top