breaking news
Naseeruddin Shah (actor)
-
రంగు మానేశాక స్వేచ్ఛ లభించింది.. ! నటి రత్నా పాఠక్ మనోగతం..
వెండి తెర నటీమణులు తమ వయసును దాచుకోవాలి. వయసును దాచాలంటే జుట్టుకు రంగు వేయాల్సిందే. అయితే బహుశా దేశంలో జుట్టుకు రంగు వేయడం మానేసిన తొలినటి రత్నా పాఠక్. స్త్రీ ఏ రంగంలోనైనా రాణించాలంటే రూపం కంటే కూడా ప్రతిభ, శరీరానికి ఇచ్చే తర్ఫీదు, దృష్టి ముఖ్యమని అంటారామె. రంగు వేయడం మానేశాక అవకాశాలు తగ్గినా వయసును యాక్సెప్ట్ చేయడంలో స్థిమితం ఉందంటున్నారామె. తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...‘నేను నటిగా కెరీర్ మొదలైన రోజుల్లో స్త్రీలకు వయసు ఉన్నంత కాలమే పాత్రలు ఉంటాయి. తర్వాత వారు తెరమరుగు అవడమే అనుకునేదాన్ని. కాని నన్ను నటిగా కలకాలం నిలబెట్టేది నా నటనా నైపుణ్యమే తప్ప రూపం, వయసు కావు అని అర్థం కావడానికి చాలా కాలం పట్టింది’ అంటారు రత్న పాఠక్.బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన దీనా పాఠక్ కుమార్తె రత్న పాఠక్ టీవీ, సినిమా రంగంలో పని చేస్తున్నారు. ఆమె నటించిన ‘సారాభాయ్ వెర్సస్ సారాబాయ్’ టీవీ సీరియల్ విశేష ఆదరణ పొందింది. ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’. ‘థప్పడ్’,‘ధక్ధక్’ సినిమా ల్లో ఆమె నటన అందరికీ గుర్తుంటుంది. సుప్రియ పాఠక్, రత్న పాఠక్ అక్కచెల్లెళ్లు. నసీరుద్దిన్ షాను వివాహం చేసుకున్న రత్నపాఠక్ విలక్షణమైన పాత్రలతో దేశ విదేశాల్లో అవార్డులెన్నో పొందారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, స్త్రీల గురించి మాట్లాడారు.ఆడపిల్లలే: ‘మా అమ్మ దీనా పాఠక్‌కు మేము ఇద్దరమే ఆడపిల్లలం. మా నానమ్మ మా ఇద్దరినీ చూసి– పాఠక్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మగ నలుసే లేదే అని నెత్తి కొట్టుకునేది. అయితే నేను, సుప్రియా నటనా రంగంలో రాణించి పాఠక్ వంశ ఘనతను కాపాడాం. మా అమ్మ, నాన్న ఫలానాది చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆడపిల్ల అనే కారణాన అడ్డుకోలేదు. చదువులో, కెరీర్లో ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం వెళ్లనిచ్చారు. చిన్నప్పటి నుంచి మాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. మా నాన్న ఢిల్లీ నుంచి కార్లు తెచ్చి ముంబై లో అమ్మేవారు. ఆయన కార్ల కోసం బయలుదేరినప్పుడల్లా మేము కూడా వెళ్లేవాళ్లం. ఆ ప్రయాణాలు కూడా మాకు మంచి చదువును ఇచ్చాయి’ అంటారామె. నటన అంటే: ‘నటనలో నాకు గురువు మా అమ్మ. అయితే ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలు రాలేదనే అనుకుంటాను. నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మూడేళ్లు నటన నేర్చుకున్నాను. ఒక నటికి కావాల్సింది మనసును, మెదడును డైలాగ్కెలా సిద్ధం చేయాలో తెలియడమే. మంచి రూపం బోనస్ కావచ్చు కాని అదే నటనకు అర్హత కాదు. మంచి నటి తన శరీరాన్ని కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా మారుస్తుంది. ఆంగికాభినయం ముఖ్యం. నటి అందంగా కంటే దృఢంగా ఉండాలి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం చేశానని. నటులకు ఈ నిర్లక్ష్యం పనికి రాదు’. అని చెప్పారు రత్నా పాఠక్.జుట్టుకు రంగు మానేశాక: ‘నటీమణులు తెల్లజుట్టులో కనిపించడానికి ఇష్టపడరు. నేనూ ఇష్టపడను. కాని తలకు రంగు వేయడం అనేది ఒక ప్రహసనం. రంగు వేసి వేసి శారీరక ధర్మాల నుంచి ఎంతకాలం దూరం వెళ్లగలం అనిపించింది. నసీరుద్దీన్ షా కూడా రంగు మానేసి చూడు... నిన్ను నీలా యాక్సప్ట్ చెయ్ హాయిగా ఉంటుంది అని ప్రోత్సహించాడు. రంగు మానేశాను. తెల్లటి జుట్టుతో కనిపిస్తుంటే ముందు మార్కెట్ పోతుంది... నాక్కూడా పోయింది. ఎందుకంటే నాతో నటించే నా వయసు మగ నటులు కూడా రంగు వేసుకుంటున్నారు. అయినా సరే నాకొచ్చే పాత్రలు నాకొచ్చాయి. నేను రంగు నుంచి స్వేచ్ఛ పొందాను. మనకు ప్రతిభ ఉంటే రూపం అడ్డు నిలవదు. ఆధునికత అంటే ఎదుటివారిని ఎలా చూస్తున్నావు, ఎలా అర్థం చేసుకుంటున్నావు అనే సంస్కారం పెరగడమే. అలాగే ఈ కాలపు కుర్రకారు మాటలు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి మాటలో బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఆధునికత అయితే నాకు గతకాలమే మేలు అనిపిస్తుంది. కాసింత మర్యాద, గౌరవం, పద్ధతీ పాడూ వద్దా ఈ కాలం పిల్లలకు?’ అని ముగించారామె.(చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..) -
RRR, పుష్ప చిత్రాలను చూడకుండానే తప్పుబట్టిన సీనియర్ నటుడు
ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఈ రెండు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. (ఇదీ చదవండి: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు) ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కనిపిస్తోందని ఆయన తెలిపాడు. అమెరికాలోని మార్వెల్ చిత్రాలు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితే భారత్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాడు. ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ చిత్రాలను ఇప్పటివరకూ చూడలేదంటూ ఈ చిత్రాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందని ఆయన తెలిపాడు. ఇలాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చూశానని, ఆయన గొప్ప దర్శకుడని కొనియాడాడు. ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని నసీరుద్దీన్ షా తెలిపాడు. ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన నసీరుద్దీన్ షాను పలువురు విమర్శిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్‌ను ఆయనకు గుర్తుచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది మర్చిపోయారా అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు. -
నా అవార్డులను వాష్‌రూమ్ డోర్ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు
బాలీవుడ్ స్టార్ నసీరుద్దీన్ షా సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇచ్చిన అవార్డులను బాత్రూమ్ డోర్లకు హ్యాండిల్స్‌గా వాడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఒక పాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్పనటుడు అవుతాడు. అంతేకానీ ఇండస్ట్రీలో ఉన్న బోలెడంతమంది నటుల్లో ఒకరిని సెలక్ట్ చేసుకుని ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడు ఇతడే అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి అవార్డులను చూసి నేను పొంగిపోను. ఆ అవార్డులతో అదే పని చేస్తా అంతెందుకు ఇటీవల నాకు ప్రకటించిన రెండు పురస్కారాలను అందుకోవడానికి కూడా నేను వెళ్లలేదు. కాబట్టి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను ఫామ్‌హౌస్ కడితే అక్కడ వాష్‌రూమ్ హ్యాండిల్స్‌గా అవార్డులను పెట్టాలనుకున్నాను. అప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్లే అందరూ హ్యాండిల్ పట్టుకుంటారు. అంటే వారికి అవార్డు వచ్చినట్లే కదా! అందుకే అదే పని చేశాను. ఫిలింఫేర్ అనీ, అదనీ, ఇదనీ.. ఇచ్చే అవార్డుల్లో నాకేమీ గొప్ప కనిపించడం లేదు. కెరీర్ ప్రారంభంలో అవార్డు వస్తే సంతోషంగా ఫీలయ్యాను. ఆ తర్వాత వరుసగా ట్రోఫీలు రావడం మొదలయ్యాయి. వెధవలా మిగిలిపోతానేమోనని నాన్న కంగారు రానురానూ ఇవన్నీ లాబీయింగ్ వల్ల వచ్చినవే అని అర్థమైంది. దీంతో వాటిని పట్టించుకోవడం మానేశా. కానీ పద్మశ్రీ, పద్మ భూషణ్ అందుకున్నప్పుడు మాత్రం మా నాన్న అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ పనికి మాలిన పని చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక వెధవలా మిగిలిపోతావు అనేవాడు. ఆరోజు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి పురస్కారం అందుకుంటున్న సమయంలో మా నాన్న ఇదంతా చూసి సంతోషిస్తాడని కృతజ్ఞతగా పైకి చూశాను. ఈ రెండు పురస్కారాలు అందుకున్నందుకు నేను గర్విస్తున్నాను. కానీ పోటీపడి ప్రకటించే అవార్డులకు మాత్రం నేను వ్యతిరేకిని' అని చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్ షా. చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్ -
సౌత్ సినిమాలు లాజిక్ లెస్.. బాలీవుడ్ నటుడు విమర్శలు
బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లో సీన్స్ ఊహకందని విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కొన్ని సీన్స్ సంబంధం లేకుండా ఉంటాయన్నారు. అలాగే పాటలు కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని విమర్శించారు. సౌత్ సినిమాల్లో అసలు లాజిక్ కొంచెం కూడా ఉండదన్నారు. సినిమాలు హిట్ అయినా కూడా స్క్రిప్ట్ తెరకెక్కించడంలో తప్పులు చేస్తారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకూ హాజరైన నసీరుద్దీన్ సౌత్ చిత్రాలపై విమర్శలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలకు ఇది కొత్తేమీ కాదని నసీరుద్దీన్ అంటున్నారు. నసీరుద్దీన్ షా మాట్లాడుతూ..' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు హిట్ అయినా.. వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా ఉంటాయి. వాటిలో పిచ్చి పిచ్చి పాటలు ఒకటి. హిట్ సినిమాలు అయినా కనీసం లాజిక్ పాటించరు. చిత్రీకరణలో చాలా లోపాలు ఉంటాయని' ఘాటుగా విమర్శించారు. ఇది చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటున్నాయని నసీరుద్దీన్ చెప్పారు. దక్షిణాది చిత్రాలను చాలా కష్టపడి తీస్తారని.. హిందీ సినిమాల కంటే హిట్ అవుతాయనడంలో సందేహం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అయితే 'కేజీఎఫ్', 'పుష్ప: ది రైజ్', కాంతార, 'ఆర్ఆర్ఆర్' వంటి సౌత్ చిత్రాలు హిందీ చిత్రాల బాక్సాఫీస్‌ను దాటేశాయి. కాగా.. నసీరుద్దీన్ షా.. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కుట్టే'లో టబు, అర్జున్ కపూర్, రాధిక మదన్, కొంకణా సెన్శర్మ, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అతను తదుపరి 'తాజ్-డివైడెడ్ బై బ్లడ్' పేరుతో రాబోయే హిస్టారికల్ డ్రామా సిరీస్‌లో అక్బర్ చక్రవర్తిగా కనిపించనున్నారు. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
ఇక్కడ మాఫియా లేదు
ప్రస్తుతం బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. నేనెందుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం. అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు. -
ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం ఎవరంటే..
ముంబై: సీనియర్ నటుడు, దర్శకుడు నసీరుద్దీన్ షా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను ప్రశంసించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్ధీన్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఢిల్లీ విద్యార్థుల నిరసనలు గురించి విపులంగా చర్చించారు. అలాగే దీపికా జేఎన్‌యూను సందర్శించడాన్ని ఆయన అభినందించారు. ఇటీవల ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడి అనంతరం దీపిక అక్కడికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించిన విషయం తెలిసిందే. అదోక సాహోసోపేత చర్యగా నసీర్ అభివర్ణించారు. అదే విధంగా జేఎన్‌యూ సందర్శన తర్వాత దీపిక ఆదరణ తగ్గదని పేర్కొన్నారు. (దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు) అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వలన ఒక సెలబ్రిటీ భవిష్యత్తుకు హాని కలిగించదా అని ప్రశ్నించగా.. ‘నటుడు కేవలం తన గురించే ఆలోచిస్తాడు. అయితే దీపిక జేఎన్‌యూని సందర్శించింనందుకు ఆమె ధైర్యాన్ని ప్రశంసించాలి. ఆమె ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉంది. ఈ చర్య వల్ల తనకు నష్టం జరుగుతుందని తెలిసినా ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసింది. దీపికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు త్వరలోనే ఇవన్నీ మరిచిపోతారు. ఆమె దీనిని ఎలా స్వీకరిస్తుందో, ఈ నిర్ణయం ఆమె పాపులారిటీని తగ్గిస్తుందా.. ఇలాంటి విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం డబ్బు మాత్రమే’ అని నసీరుద్దీన్ తెలిపారు. కాగా నవంబరులో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును సవాలు చేస్తూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని కొంతమంది న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన 100 మంది ముస్లింలలో నసీరుద్దీన్ ఒకరు. వివాదాన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా సమాజానికి హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చదవండి :నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్! ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్! -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నసీరుద్దీన్ షా (బాలీవుడ్ నటుడు) గ్రేసీ సింగ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించినది. వీరి పుట్టిన తేదీ 20. అంటే 2 . ఇది చంద్రునికి సంబంధించినది. వీరు ఈ సంవత్సరం ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. పూర్వికుల ఆస్తులు అందిపుచ్చుకుంటారు. వీరికి ధనానికి లోటుండదు. అయితే ఈ సంవత్సరం ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. మీది చంద్రప్రభావితమైన జాతకం కాబట్టి మీ ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది. దీనివల్ల రాజకీయంగా ఎదుగుతారు లేదా మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, జ్యోతిష్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంచి పేరు, ఆదాయం లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అంతగా కలిసి రావు. అందువల్ల వాయిదా వేసుకోవడం మంచిది. లివర్‌కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. లక్కీనంబర్స్: 1,2,5,6,8; లక్కీ కలర్స్: బ్లాక్, వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో. లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: మహామృత్యుంజయ హోమం చేయించడం, ప్రార్థనలు పెట్టించడం, ఖురాన్ పఠనం చేయడం, మదరసాలు, వేదపాఠశాలలు, క్రైస్తవ మిషినరీలకు సహాయం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్