Naseeruddin Shah Revealed He Suffers From Onomatomania - Sakshi
Sakshi News home page

Naseeruddin Shah: 'అదొక మానసిక వ్యాధి.. చాలాకాలంగా బాధపడుతున్నా'

Mar 7 2022 8:16 PM | Updated on Mar 7 2022 8:57 PM

Naseeruddin Shah Revealed He Suffers From Onomatomania - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు.

ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్‌ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్‌ షా ఇటీవలె గెహ్రిహాన్‌ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్‌వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement