పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 19 2015 11:29 PM | Updated on Sep 3 2017 5:48 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నసీరుద్దీన్ షా (బాలీవుడ్ నటుడు) గ్రేసీ సింగ్ (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించినది. వీరి పుట్టిన తేదీ 20. అంటే 2 . ఇది చంద్రునికి సంబంధించినది.  వీరు ఈ సంవత్సరం ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. పూర్వికుల ఆస్తులు అందిపుచ్చుకుంటారు.  వీరికి ధనానికి లోటుండదు. అయితే ఈ సంవత్సరం ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మాత్రం మంచిది కాదు.

మీది చంద్రప్రభావితమైన జాతకం కాబట్టి మీ ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది. దీనివల్ల రాజకీయంగా ఎదుగుతారు లేదా మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, జ్యోతిష్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంచి పేరు, ఆదాయం లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అంతగా కలిసి రావు. అందువల్ల వాయిదా వేసుకోవడం మంచిది. లివర్‌కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.
 
లక్కీనంబర్స్: 1,2,5,6,8; లక్కీ కలర్స్: బ్లాక్, వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో. లక్కీ డేస్:  గురు, శుక్ర, శనివారాలు.
సూచనలు: మహామృత్యుంజయ హోమం చేయించడం, ప్రార్థనలు పెట్టించడం, ఖురాన్ పఠనం చేయడం, మదరసాలు, వేదపాఠశాలలు, క్రైస్తవ మిషినరీలకు సహాయం చేయడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement