నరుడి బ్రతుకు నటన | Narudi Bratuku Natana Movie poster release | Sakshi
Sakshi News home page

నరుడి బ్రతుకు నటన

Oct 10 2020 1:04 AM | Updated on Oct 10 2020 1:04 AM

Narudi Bratuku Natana Movie poster release - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి వీరిద్దరూ జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నటించనున్నారు. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్‌ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  నిర్మించనున్న ఈ సినిమా దీపావళికి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. హెడ్‌ఫోన్స్, హార్ట్‌ సింబల్‌.. ఓ జంటతో ఈ ప్రచార చిత్రాన్ని డిజైన్‌ చేశారు. మామూలుగా హార్ట్‌ సింబల్‌ ఎరుపు రంగులో ఉంటుంది. కానీ నీలం రంగులో కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, సంగీతం: కాలభైరవ, కెమెరా: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ధీరజ్‌ మొగిలినేని.

Advertisement
 
Advertisement
Advertisement