జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరిన పోలీసులు | Narsingi Police Petition For Jani Master Custody | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరిన పోలీసులు

Sep 23 2024 6:37 PM | Updated on Sep 23 2024 8:07 PM

Narsingi Police Petition For Jani Master Custody

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, తాజాగా నార్సింగ్‌ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేసిన సమయంలోనే నార్సింగ్‌ పోలీసులు విచారించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు విషయాలను పొందుపరిచారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారని తెలుస్తోంది. మరిన్నీ విషయాలు తెలుసుకునేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని నార్సింగ్‌ పోలీసులు భావించారు. ఈమేరకు వారం రోజుల పాటు తమ కస్టడీలో జానీ మాస్టర్‌ను ఉంచాలని రంగారెడ్డి కోర్టులో తాజాగా పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతానికి కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అయితే రాలేదు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement