‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా? | Nani Rejected Balagam Venu Story, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా?

Published Tue, Jun 18 2024 5:26 PM | Last Updated on Tue, Jun 18 2024 6:51 PM

Nani Rejected Balagam Venu Story, Rumours Goes Viral

హీరో నాని సినిమా ప్లానింగ్‌ గురించి అందరికి తెలిసిందే. చేతిలో ఒక్క సినిమా ఉండగానే..మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేసుకుంటాడు. అందుకే హిట్‌, ఫ్లాప్‌ తేడా లేకుండా ఈ నేచురల్‌ స్టార్‌ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి. గతేడాది డిసెంబర్‌లో ‘హాయ్‌ నాన్న’తో ప్రేక్షకులను పలకరించిన నాని..ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు. ఆగస్ట్‌ 29న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

(చదవండి: నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను)

ఈ చిత్రం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయాల్సింది. అందులో ఒకటి బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్‌ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కాలి. నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో వేణు ఓ కథను కూడా రెడీ చేశాడట. ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. 

(చదవండి:  రిలీజ్‌కు ముందే కల్కి మరో రికార్డు.. )

కానీ ఇప్పుడు ఈ చిత్రం క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తోంది. నానినే ఈ చిత్రాన్ని రిజెక్ట్‌ చేశాడట. బలగం వేణు చెప్పిన కథకు, శ్రీకాంత్‌ ఓదెల చెప్పిక కథల మధ్య సారూప్యత ఉండడంతో..నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సాహో ఫేం సుజిత్‌ సినిమాను కూడా నాని రిజెక్ట్‌ చేశాడు.  మంచి కథ దొరికితే భవిష్యత్తులో నాని-వేణు  కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement