గెటప్‌లు మార్చేసిన కీర్తిసురేష్‌, నాని.. ఎందుకో తెలుసా? | Nani And Keerthy Suresh Wraps Up Dasara Shooting | Sakshi
Sakshi News home page

Keerthy Suresh-Nani : గెటప్‌లు మార్చేసిన కీర్తిసురేష్‌, నాని.. ఎందుకో తెలుసా?

Published Fri, Jan 13 2023 2:01 PM | Last Updated on Fri, Jan 13 2023 2:02 PM

Nani And Keerthy Suresh Wraps Up Dasara Shooting - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్‌ ఒద్దెల తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి దాదాపు రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మాస్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ మేరకు కీర్తి సురేష్‌ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. నిన్న మొన్నటివరకు గుబురు గడ్డంతో రఫ్‌లుక్‌లో కనిపించిన నాని తాజాగా క్లీన్‌ షేవ్‌తో కొత్తగెటప్‌లో దర్శనమిచ్చాడు.

సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ రావడంతో హీరో, హీరోయిన్లు న్యూలుక్‌లో మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement