తారకరత్న కూతురు బర్త్‌ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్! | Sakshi
Sakshi News home page

Tarakaratna Daughter: తారకరత్న కూతురు బర్త్‌ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

Published Sun, Dec 31 2023 9:35 AM

Nandamuri Tarakaratna Daughter Nishka Birthday Post Goes viral - Sakshi

నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్‌ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. 

(ఇది చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య)

తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్‌ డే కావడంలో ఆయన భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్‌ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము(అమ్మ) ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనలైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి  కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు. 

పిల్లల పేర్లలో ఎన్టీఆర్‌

మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 
Advertisement
 
Advertisement