ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య | Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post - Sakshi
Sakshi News home page

ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య రెడ్డి

Published Mon, Aug 28 2023 1:09 PM

Taraka Ratna Wife Alekhya Emotional Post - Sakshi

నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్‌ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ  చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పైనే తారకరత్నకు చికిత్స అందించారు.

కానీ ఫలితం దక్కలేదు. ఇదే ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఆ సమయంలో ఎవరి వల్ల కాలేదు.

తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్యరెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవలపిల్లులు అయిన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు. దీంతో అలేఖ్యరెడ్డి సోషల్‌ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా  తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్‌ చేశారు. మొదట వారి పెద్ద కూతురు అయిన నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్‌ ఆమెకు సాయిం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!)

ఇలా ఆ ఫోటోలు చూస్తూ.. తారకరత్నను మరోసారి గుర్తుచేసుకున్న ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆ వీడియోతో పాటు తారకరత్న గురించి అలేఖ్య రెడ్డి ఇలా రాసుకొచ్చారు. తాన్యారామ్, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలను ఆనందంగా చెప్పలేకపోతున్నానని తారకరత్నను ఆలేఖ్య గుర్తుచేసుకున్నారు.

'ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల మొఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్‌. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు (తారకరత్న), మమ్ము, ఎన్ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు.' అని ఆలేఖ్య తెలిపారు.

పిల్లల పేర్లలో ఎన్టీఆర్‌
మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న.

Advertisement
Advertisement