బాలయ్య బర్త్‌ డే.. యాక్షన్‌ గ్లింప్స్ రిలీజ్ | Nandamuri Balakrishna NBK111 Glimpse out now | Sakshi
Sakshi News home page

NBK111 Glimpse: బాలయ్య బర్త్‌ డే.. యాక్షన్‌ గ్లింప్స్ రిలీజ్

Jun 10 2026 6:09 PM | Updated on Jun 10 2026 6:17 PM

Nandamuri Balakrishna NBK111 Glimpse out now

నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్‌బీకే111 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవాళ బాలయ్య బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్‌బీకే111 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ ఫైట్ సీన్ చూస్తుంటే మరో యాక్షన్‌ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీతో ఫైట్‌ సీన్‌ మరి ఓవర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ కంపోజ్ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement