డబ్బింగ్‌ డన్‌ | Nagarjuna Wraps Up Dubbing For Sekhar Kammula Kuberaa | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ డన్‌

Jun 8 2025 4:29 AM | Updated on Jun 8 2025 4:29 AM

Nagarjuna Wraps Up Dubbing For Sekhar Kammula Kuberaa

హీరో అక్కినేని నాగార్జున ‘కుబేర’ సినిమాలోని  తనపాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ ‘కుబేర’. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, జిమ్‌ సర్భ్‌ కీలకపాత్రపోషించారు. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించారు.

ఈ సినిమా ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా తనపాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని ప్రకటించి, డబ్బింగ్‌ స్టూడియోలో నాగార్జున, శేఖర్‌ కమ్ముల, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు కలసి మాట్లాడుతున్న ఫొటోలని మేకర్స్‌ షేర్‌ చేశారు.

‘‘ఈపాన్‌ ఇండియా చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీ ఇండియన్‌ సినిమాలో గేమ్‌ ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి స్పందన వచ్చింది. పోయిరా మామ, ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర...’ వంటిపాటలు టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement