కథ విన్నారా? | Sakshi
Sakshi News home page

కథ విన్నారా?

Published Tue, Oct 10 2023 5:37 AM

Nagarjuna in talks with Tamil director for landmark 100th film - Sakshi

హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్‌. స్క్రిప్ట్‌ నచ్చడంతో నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్‌ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది.

అంతేకాదు.. నాగార్జున కెరీర్‌లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది.

Advertisement
Advertisement