అంతులేని వినోదానికి రెడీనా? బిగ్‌బాస్‌ 8 వీడియో షేర్‌ చేసిన నాగార్జున | Nagarjuna Released Bigg Boss Telugu 8 Logo | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ 8 వచ్చేస్తోంది.. అప్‌డేట్‌ ఇచ్చిన నాగ్‌..

Jul 21 2024 1:25 PM | Updated on Jul 21 2024 1:42 PM

Nagarjuna Released Bigg Boss Telugu 8 Logo

బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. మొదట్లో అదరగొట్టిన ఈ షో తర్వాత కాస్త దారి తప్పింది. దీంతో కింగ్‌ నాగార్జున ఇలాగైతే కష్టమని రూటు మార్చేశాడు. ఏడో సీజన్‌ ప్రమోషన్లు వెరైటీగా చేశాడు. ప్రోమోలతోనే హైప్‌ ఎక్కించాడు. ఉల్టా పుల్టా అంటూ షోలో కొత్తదనం తీసుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ 7 అలా
అయితే బిగ్‌బాస్‌ తెలుగు 2 సీజన్‌లో ఏం జరిగిందో ఏడో సీజన్‌లోనూ అదే జరిగింది. అప్పుడు కౌశల్‌ వర్సెస్‌ మిగతా కంటెస్టెంట్లు కాగా గత సీజన్‌లో రైతుబిడ్డ వర్సెస్‌ బీటెక్‌ బ్యాచ్‌ అన్నట్లుగా మారింది. ఫలితంగా రెండో సీజన్‌ ఫలితాలే వచ్చాయే. అప్పుడు కౌశల్‌ ఎలా గెలిచాడో రైతుబిడ్డ అలాగే గెలిచాడు. ఇదిలా ఉంటే ఈసారి ఎనిమిదో సీజన్‌కు ఎవరెవర్ని తెస్తారన్న ఆత్రుత ప్రేక్షకుల్లో ఈపాటికే మొదలైంది.

ఈసారి కలర్‌ఫుల్‌ లోగో
పలువురి పేర్లు కూడా సోషల్‌ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో బిగ్‌బాస్‌ 8 కొత్త లోగో ఇదేనంటూ కింగ్‌ నాగార్జున ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ తీసుకొచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా? అంటూ కొత్త లోగోను ప్రవేశపెట్టాడు. ఈసారి లోగో కూడా కలర్‌ఫుల్‌గా ఉండి ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయితే ఈ సీజన్‌ సెప్టెంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కానుంది.

 

 

చదవండి: హార్దిక్‌ పాండ్యాను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!

Advertisement
 
Advertisement
Advertisement