బిగ్‌బాస్‌ 9లోకి కామన్‌ ఆడియన్స్‌ .. ఇలా రిజస్టర్‌ చేసుకోండి | BIGG BOSS Season 9 Call For Entries Promo | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 9లోకి కామన్‌ ఆడియన్స్‌ .. ఇలా రిజస్టర్‌ చేసుకోండి

Jun 28 2025 8:41 PM | Updated on Jun 28 2025 8:54 PM

BIGG BOSS Season 9 Call For Entries Promo

బిగ్‌బాస్‌ 9 (Bigg Boss Season 9) నుంచి ఇప్పటికే ఒక వీడియోతో ప్రకటన వచ్చేసింది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్‌గా మరోసారి అక్కినేని నాగార్జున  పంచ్‌ డైలాగ్ పేల్చేశారు. అయితే, తాజాగా 'కాల్‌ ఫర్‌ ఎంట్రీస్‌' పేరుతో మరో వీడియోను బిగ్‌బాస్‌ టీమ్‌ వదిలింది. గతంలో మాదిరి ఈసారి కామన్‌ ఆడియన్స్‌ను  కంటెస్టెంట్స్‌గా తీసుకుంటామని  వీడియోలో పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌ షోను ఎంతో ప్రేమిస్తున్న ప్రేక్షకులకు రిటర్న్‌ గిఫ్ట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుందని, అది కూడా కంటెస్టెంట్స్‌గా వచ్చే ఛాన్స్‌ ఉందని నాగార్జున తెలిపారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీస్‌తో పాటు కామన్‌ ఆడియన్స్‌ కూడా బిగ్‌బాస్‌- 9లోకి వెళ్లొచ్చు. అందుకు మీరు చేయాల్సింది www.bb9.jiostar.comలో రిజస్టర్‌ కావడమే. ఆపై బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ కావడానికి కారణం చెబుతూ వీడియోను అప్లోడ్‌ చేయడమే అంటూ వివరాలు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement