Nagarjuna: నాగ చైతన్య-సమంత విడాకులపై నాగార్జున కామెంట్స్‌ వైరల్‌

Nagarjuna Reacts To Naga Chaitanya Samantha Divorce - Sakshi

టాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌గా గుర్తింపు పొందిన సమంత-నాగ చైతన్య విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టిపిక్‌గానే ఉంది. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ వారి ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీ అయిపోయారు. కానీ ఇప్పటికీ వారి డివోర్స్‌పై ఎప్పుడూ ఏదో ఒక అంశం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా బ్రహ్మాస్త్ర సక్సెస్‌ మీట్‌ సందర్భంగా జాతీయ మీడియాతో ముచ్చటించిన నాగార్జునకు చై-సామ్‌ విడాకులకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

నాగ చైతన్య ప్రొఫెషనల్‌ లైఫ్‌ కంటే పర్సనల్‌ లైఫ్‌పైనే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇది తండ్రిగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుందా అని అడిగిన ప్రశ్నకు నాగ్‌ బదులిస్తూ.. నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు. నాకు అది చాలు. అది జీవితంలో ఒక అనుభవం.

విడాకులు చాలా దురదృష్టకరం..కానీ దాని గురించే మేము ఆలోచిస్తూ కూర్చోలేము. అది జరిగిపోయింది. మా జీవితాల నుంచి వెళ్లిపోయింది. ఎవరి జీవితంలో అయినా ఇలాంటివి జరిగితే దాని నుంచి బయటపడాలి' అంటూ నాగ్‌  చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top