Naga Shaurya : నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?

Naga Sharya To Tie Knot With His Girl Friend Anusha Shetty - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్‌లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు.

పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్‌. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్‌ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 

2019-2020లో ది బెస్ట్‌ డిజైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top