ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత | Sakshi
Sakshi News home page

Vijay Anand: సంగీత దర్శకుడు కన్నుమూత, వందకు పైగా సినిమాలకు..

Published Thu, Feb 8 2024 8:05 AM

Music Director Vijay Anand Passed Away - Sakshi

చెన్నై: సీనియర్‌ సంగీత దర్శకుడు విజయ్‌ ఆనంద్‌ (71) మంగళవారం చైన్నెలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. విసు దర్శకత్వం వహించిన నాణయం ఇల్లాద నాణయం చిత్రం ద్వారా విజయ్‌ ఆనంద్‌ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన 'నాన్‌ అడిమై ఇల్లై' చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా ఆ చిత్రంలోని 'ఒరు జీవన్‌ దాన్‌ ఉన్‌ పాడల్‌దాన్‌..' పాట చాలా పాపులర్‌ అయ్యింది. తమిళంలో 'కొరుక్కు ఉపదేశం', 'రాసాతి వరుం నాళ్‌' తదితర 10 చిత్రాలకు పని చేసిన విజయ్‌ ఆనంద్‌ కన్నడంలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించడం విశేషం. కాగా విజయ్‌ఆనంద్‌ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళాకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

చదవండి: బెల్లంకొండ గణేశ్‌తో లవ్‌? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement