బెల్లంకొండ గణేశ్‌తో లవ్‌? హీరోయిన్‌ ఏమందంటే? | Varsha Bollamma reacts on marriage rumors with Bellamkonda Ganesh | Sakshi
Sakshi News home page

Varsha Bollamma: బెల్లంకొండ గణేశ్‌తో లవ్‌? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published Thu, Feb 8 2024 4:28 AM | Last Updated on Thu, Feb 8 2024 11:31 AM

Varsha Bollamma reacts on marriage rumors with Bellamkonda Ganesh - Sakshi

‘‘పాత్ర నిడివి కాదు... నా పాత్ర ప్రాముఖ్యతను బట్టి కథలు ఓకే చేయడానికి ఆసక్తి చూపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ అలా ఎంచుకున్నవే’’ అన్నారు వర్షా బొల్లమ్మ. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ హీరోయిన్లు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో నేను ట్రైబల్‌ అమ్మాయి భూమి పాత్రలో కనిపిస్తాను. తన ఊర్లో చదువుకున్న అమ్మాయి ఒక్క భూమి మాత్రమే. అందంగా, అమయాకంగా కనిపించే ఈ పాత్రలో స్ట్రెంత్, పవర్‌ ఉన్నాయి.

ఈ సినిమాలో ఉన్న సందేశం కూడా నా పాత్రతోనే వస్తుంది. నా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌కు భూమి పాత్ర కాస్త దగ్గరగా అనిపించింది. వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అలా ఎలా ఆలోచించి కథలు రెడీ చేస్తారు? అనుకున్నాను. కథ అంత బాగా అనిపించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్నాను. తెలుగులో ఓ కొత్త ప్రాజెక్ట్‌ సైన్‌ చేశాను. ఇక హీరో బెల్లంకొండ గణేశ్‌తో నేను ప్రేమలో ఉన్నానన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement