
నటి మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ విషయాన్ని ఆ ఇద్దరూ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజాగా మృణాల్ ఈ వార్తలను నిజం చేసేలా మరో అడుగు ముందుకేసింది ధనుష్ సిస్టర్స్ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో వారిద్దరు కూడా మృణాల్‌ను ఫాలో అయ్యారు. దీంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల కాలంలో తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డేటింగ్ వార్తలు వస్తున్నప్పటికీ కూడా ధనుష్ కుటుంబానికి ఆమె మరింత దగ్గరవుతుంది. దీంతో ఈ వార్తలు నిజమనేదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫాలో అవ్వడం అభిమానులు గమనించారు. మృణాల్ ఠాకూర్‌కు ధనుష్ ఇంట్లో మరింత ప్రాముఖ్యత పెరిగిందని చెప్పవచ్చు. ధనుష్ కోసం మొదట తన ఆడబిడ్డలను లైన్లో పెట్టే పనిలో మృణాల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరల్ అయింది. ఆపై మృణాల్ ఠాకూర్ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబైకి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. జులై 3న ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ బాలీవుడ్ సినిమా 'తేరే ఇష్క్ మే' షూటింగ్‌ను ముగించాడు. ఈ సందర్భంగా జరిగిన పార్టీకి మృణాల్ హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తే క్లారిటీ వస్తుంది.