అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్ | Mrunal Thakur About Happiness And Sharing | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది

Jun 7 2026 7:49 AM | Updated on Jun 7 2026 11:29 AM

Mrunal Thakur About Happiness And Sharing

మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎందరు దీన్ని పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్‌ ఠాకుర్‌ ఇప్పుడే తెలుసుకుందట. ఉత్తరాది భామనే అయినప్పటికీ బాలీవుడ్‌లో కంటే దక్షిణాదిలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు మృణాల్‌ కెరీర్‌కి చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామ.. కోలీవుడ్‌ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉంది.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)

ఈ పాటికే హీరో శివకార్తికేయన్‌తో జోడీ కట్టే అవకాశం ఈమెని వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ మూవీలో నటించలేకపోయింది. తాజాగా ధనుష్‌‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపోతే రీసెంట్‌గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె.. జీవితంలో నిజమైన ఆనందం గురించి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుందని అనుకున్నా. అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుందని తెలుసుకున్నా. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానిలో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అనేదాని గురించి ఎదురుచూడను. చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్‌ ఠాకుర్‌ చెప్పింది.

(ఇదీ చదవండి: వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు.. కమెడియన్ మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement