వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు.. కమెడియన్ మృతి | Malayalam Actor Salim Kumar No More | Sakshi
Sakshi News home page

Salim Kumar: విషాదం.. ప్రముఖ స్టార్ కమెడియన్ కన్నుమూత

Jun 7 2026 6:46 AM | Updated on Jun 7 2026 11:20 AM

Malayalam Actor Salim Kumar No More

మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ సలీమ్ కుమార్(56) కన్నుమూశారు. గత కొన్నిరోజులగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు.. ఈయనని వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం చనిపోయారు. దీంతో మలయాళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

1969లో పుట్టిన సలీమ్ కుమార్.. మిమిక్రీ, స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో కెరీర్ ప్రారంభించారు. నాటకాల్లోనూ పాల్గొన్నారు. 1990లో ఇండస్ట్రీలోకి వచ్చారు.మలయాళ, తమిళం, ఒడియా భాషల్లో కలిపి 300కి పైగా సినిమాలు చేశారు. నటనతో పాటు దర్శకుడిగానూ కంపార్ట్‌మెంట్, కరుత జోతన్ లాంటి మూవీస్ తీశారు. 2010లో విడుదలైన 'అడమింటే మఖన్ అబు' చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మలయాళ చిత్రసీమలో పలు సినిమాలు చేశారు.

సలీమ్ కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తనకు ఉన్న లివర్ సిరోసిస్ వ్యాధి.. మద్యం సేవించడం వల్ల రాలేదని, వంశపారంపర్యంగా వచ్చిన సమస్యనే అని గతంలో ఈయన చెప్పారు. ఇప్పుడు ఆ సమస్యతో చనిపోయారు. ఈయన మృతిపట్ల మాలీవుడ్ విచారం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో పలువురు మలయాళ సెలబ్రిటీలు పోస్టులు కూడా పెడుతూ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement