సంక్రాంతికి ఫిక్స్‌

Most Eligible Bachelor New Poster Release - Sakshi

అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కొత్త పోస్టర్‌ బుధవారం విడుదలయింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు త్వరలో ఆరంభం కానున్నాయి. టాకీ పార్ట్‌ దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తామని గతంలో చెప్పారు నిర్మాతలు. కరోనా వల్ల షూటింగ్స్‌కి ఆటంకం ఏర్పడటంతో విడుదల వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top