Sakshi News home page

Neru: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు!

Published Fri, Jan 19 2024 12:46 PM

Mohanlal Starrer Neru Movie OTT Release Date Out - Sakshi

ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్‌ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్‌ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ  ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్‌ అవుతున్నాయి. 

ఓటీటీలోకి నేరు
తాజాగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్‌, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్‌ 21న థియేటర్లలో విడుదలైంది.

ఓటీటీలో రిలీజ్‌
ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్‌లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది.

చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార

Advertisement

What’s your opinion

Advertisement