ఖురేషీకి రైట్‌ హ్యాండ్‌ | Mohan Lal unveils L2: Empuraan first look of Prithviraj Sukumaran | Sakshi
Sakshi News home page

ఖురేషీకి రైట్‌ హ్యాండ్‌

Oct 17 2024 1:30 AM | Updated on Oct 17 2024 1:30 AM

Mohan Lal unveils L2: Empuraan first look of Prithviraj Sukumaran

మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ (2019) బ్లాక్‌ బస్టర్‌ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’ మూవీ రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తుండగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే... బుధవారం (అక్టోబర్‌ 16) పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’లో ఆయన పోషిస్తున్న జయేద్‌ మసూద్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఎల్‌ 2 ఎంపురాన్‌’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్, ఆయనకు రైట్‌ హ్యాండ్‌లా జయేద్‌ మసూద్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించనున్నారు. 2025లో మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement