Miss Universe 2023 Title: విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న షెన్నిస్ పలాసియోస్!

Miss Universe 2023 Title Winner Nicaragua Sheynnis Palacios - Sakshi

మిస్​ యూనివర్స్ 2023 టైటిల్‌​ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్​ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్‌ యూనివర్స్‌' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు  అలంకరించారు. 

ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top