Minister Talasani Srinivas Yadav Talk About Rudrambapuram Movie - Sakshi
Sakshi News home page

‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు

Jul 18 2023 4:16 PM | Updated on Jul 18 2023 4:53 PM

Minister Talasani Srinivas Yadav Talk About Rudrambapuram Movie - Sakshi

ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న రుద్రామాంబపురం చిత్రంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్‌  ప్రశంసలు కురిపించారు. మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన ఈ చిత్రం తనకు బాగా నచ్చిందన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన చిత్రబృందానికి ఆభినందనలు తెలుపుతున్నాను అన్నారు. 

ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్ అందించారు. శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.

తాజాగా ఈ సినిమా వీక్షించిన మంత్రి..పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ.. మా రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు, ప్రస్తుతం  సినిమా హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ట్రేండింగ్ అవుతోంది. థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement