మురళీమోహన్‌కు సన్మానం | Sakshi
Sakshi News home page

మురళీమోహన్‌కు సన్మానం

Published Sat, Dec 30 2023 7:19 PM

Minister Komatireddy Venkat Reddy Comments At VB Entertainments Silver Screen Awards 2023 - Sakshi

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీ మోహన్‌కి 'నట సింహ చక్రవర్తి' బిరుదు ప్రదానం చేశారు. వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన  ఆధ్వర్వంలో ఈ వేడుకకి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నారు. బిజీ షెడ్యూల్ ని కూడా పక్కనపెట్టి మురళీమోహన్ గారి కోసం ఈవెంట్ కి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారు ఆయన్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

‘నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని 'నటసింహ చక్రవర్తి' బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’అని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. ‘ప్రతి  ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’అని వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన అన్నారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా   సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి.  ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement