ఇటీవల మంచి కంటెంట్‌తో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే హీరో హీరోయిన్లు ఎవరైనా గానీ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయిన నటులలో మునీష్ కాంత్ ఒకరు. పలు చిత్రాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గానూ మెప్పించిన ఈయన తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిడిల్ క్లాస్. కాగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిన నటి విజయలక్ష్మి తాజాగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబుకు చెందిన యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన తాజా చిత్రం మిడిల్ క్లాస్. కిషోర్ ముత్తు రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదభరిత కథాచిత్రంగా అనిపించినా , ఒక సందర్భంలో థ్రిల్లర్ బాణీలో సాగుతుందన్నారు.
ఇందులో నటుడు మునీష్ కాంత్ తన సొంత ఊరిలో స్థలం కొనుక్కుని సెటిల్ అవ్వాలని ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటాడన్నారు. అయితే ఆయన భార్య మాత్రం సిటీలో జీవించాలని ఆశపడుతుందన్నారు. అలా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత వారి సంతాన జీవితం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో నటుడు రాధారవి, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు.


