నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్‌ సేతుపతి థ్రిల్ల‌ర్‌ సినిమా | Sakshi
Sakshi News home page

నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్‌ సేతుపతి థ్రిల్ల‌ర్‌ సినిమా

Published Thu, Jan 25 2024 8:17 AM

Merry Christmas OTT Streaming Date Locked - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మ‌స్ మూవీ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాలీవుడ్‌లో డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ రాఘ‌వ‌న్‌ను మాస్ట‌ర్ ఆఫ్ స్టోరీ టెల్ల‌ర్‌గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బ‌ద్లాపూర్‌ వంటి థ్రిల్లర్‌ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌ శ్రీరామ్ రాఘ‌వ‌న్‌కు  థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్‌లోనే మెర్రీ క్రిస్మస్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. జ‌న‌వ‌రి 12న ఈ మూవీ రిలీజైంది. 

భారీ అంచ‌నాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్‌ కలెక్షన్స్‌ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్‌ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్‌.30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్‌ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్‌ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని టాక్‌.

మ్యాచ్‌ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.
 

 
Advertisement
 
Advertisement