మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ‘ఏ మాస్టర్‌ పీస్‌’ | Merge XR and Cinema Bandi joined Hands To Produce A Masterpiece | Sakshi
Sakshi News home page

మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ‘ఏ మాస్టర్‌ పీస్‌’

Apr 9 2024 1:05 PM | Updated on Apr 9 2024 3:06 PM

Merge XR and Cinema Bandi joined Hands To Produce A Masterpiece - Sakshi

మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకు పూర్వజ్‌. ఆయన తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ఏ మాస్టర్‌ పీస్‌’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. 

ఏ మాస్టర్ పీస్ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా "ఏ మాస్టర్ పీస్" ఉండబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement