Megastar Chiranjeevi About Waltair Veerayya Press Meet, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi Tweet: వాల్తేరు వీరయ్యకు ముఖ్యమైన వ్యక్తి గురించి మర్చిపోయా: చిరంజీవి

Dec 28 2022 3:15 PM | Updated on Dec 28 2022 4:30 PM

Megastar Chiranjeevi Tweet Viral About Waltair Veerayya Press Meet  - Sakshi

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'.  ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస‍్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటలు రిలీజ్ చేసింది చిత్రబృందం. తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రబృందం ఓ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానలిచ్చింది. అయితే ఈవెంట్‌ గురించి మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ ప్రెస్‌మీట్‌లో తాను ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి ప్రస్తావించడం మర్చిపోయానని ట్వీట్‌ చేశారు. ఇంతకీ అంతా ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది? ఓ లుక్కేద్దాం. 

మెగాస్టార్‌ తన ట్వీట్‌లో రాస్తూ..' వాల్తేరు వీరయ్య టీం అందరితో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది.  సినిమా విడుదలకు చాలా ముందు జరిగినా టీం అందరూ ఎంతో సంతోషంగా వాళ్ల మెమోరీస్‌ను పంచుకోవడంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ సంతృప్తిగా జరిగింది.  అయితే ఈ ఈవెంట్‌లో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని అనుకోవడంతో ముఖ్యంగా నా తమ్ముడు, వీరయ్యకు ముఖ్యమైన వ్యక్తి రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఈ విషయం గురించే వెలితిగా ఫీలయి ట్వీట్‌ చేస్తున్నాను. ప్రాజెక్ట్ గురించి  చెప్పగానే అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర నుంచి, కలిసి షూట్‌ చేసిన ప్రతి రోజూ రవితో మళ్లీ ఇన్నేళ్లకు చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా ఉంది. ఆ విషయాలు త్వరలోనే మాట్లాడుకుందాం. ' అంటూ పోస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement