Chiranjeevi- Sarath Babu: 'శరత్ బాబుతో నాకు ప్రత్యేక అనుబంధం': చిరంజీవి

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అనేక చిత్రాలలో నా సహనటుడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!)
కాగా.. అనారోగ్య కారణాలత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించిన కుటుంబసభ్యులు.. మంగళవారం చెన్నై ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
(ఇది చదవండి: 3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!)
వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు
శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది.
అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న
శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు,
అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023