తెలంగాణ సీఎంకు అభినందనలు.. చిరంజీవి ట్వీట్! | Megastar Chiranjeevi Congratulations To Telangana New Chief Minister Revanth Reddy- Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మీ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలి: సీఎంకు చిరు అభినందనలు

Published Thu, Dec 7 2023 2:58 PM

Megastar Chiranjeevi Congratulations To Telengana CM Revanth Reddy - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్‌ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

కాగా.. నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. అధికారంలో బీఆర్‌ఎస్‌ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సభలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement