'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ పోస్ట్ వైరల్! | Mega Hero Sai Dharam Tej Post Goes Viral On Prabhas Salaar Movie Release Tomorrow, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: బెస్ట్ ఆఫ్ ల‌క్‌.. సినిమానే గెలిచింది: సాయి ధరమ్‌ తేజ్ పోస్ట్ వైరల్!

Published Thu, Dec 21 2023 9:11 PM

Mega Hero Sai Dharam Tej Post Goes Viral Salaar Release Tomorrow - Sakshi

ఈ ఏడాది విరూపాక్షతో హిట్‌ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. 

పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే వ్య‌క్తుల్లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. ఎల్ల‌ప్పుడూ సినిమా గెల‌వాల‌ని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాల‌ని కోరుకునే వ్య‌క్తి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ‌. తాజాగా ఆయ‌న చేసిన పోస్ట్ సినీ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్న‌త‌ స్థితికి చేరుకుందని తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ నోట్‌లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్.  షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో విడుదల కావడం గ‌ర్వంగా వుంది. మూడు అగ్ర సినీ ప‌రిశ్ర‌మ‌లు ఓకేసారి ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వ‌డానికి సిద్దం కావ‌డం గొప్ప విష‌యం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్ర‌స్థాయిలో ఉన్న ఫీలింగ్ క‌లుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌ షారుఖ్ సార్‌. డంకీ చిత్రంతో వ‌రుస‌గా హ్య‌ట్రీక్ స‌క్సెస్ సాధించాలి. స‌లార్‌తో  వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్దమైన ప్ర‌భాస్ అన్న‌కు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ ల‌క్‌' అంటూ రాసుకొచ్చారు.

ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ ‍అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్‌ తేజ్ నోట్ విడుదల చేశారు. 


 

Advertisement
 
Advertisement