శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర' | Marathi beauty in NTR Devara | Sakshi
Sakshi News home page

శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'

Feb 27 2024 1:09 AM | Updated on Feb 27 2024 6:48 AM

Marathi beauty in NTR Devara - Sakshi

మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్‌లో శ్రుతి జాయిన్‌ అయ్యారు.

ఈ విషయాన్ని సోషల్‌ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది.   

Advertisement
 
Advertisement
Advertisement