Manish Malhotra Buys 21 Crore Worth Apartment In Mumbai Bandra - Sakshi
Sakshi News home page

Manish Malhotra: కాస్ట్‌లీ అపార్ట్‌మెంట్‌ కొన్న మనీష్‌ మల్హొత్రా.. ధర ఎంతంటే

Mar 24 2022 1:00 PM | Updated on Mar 24 2022 1:43 PM

Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra - Sakshi

Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ టాప్‌ హీరోయినర్స్‌ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్‌ చేస్తుంటారాయన. బీటౌన్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా మనీష్‌ మల్హొత్రా కాస్ట్యూమ్స్‌ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాష‌న్ క‌ల‌ల‌ ప్ర‌పంచానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన ఈ కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ముంబైలో భారీ మొత్తానికి మనీష్‌ మల్హొత్ర ఓ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్‌లోని భోజ్వ‌నీ ఎన్‌క్లేవ్‌లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్‌లీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement