Mani Ratnam Ponniyin Movie Selvan OTT Release Date Confirmed, Check OTT Streaming Platform - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan OTT Release: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Oct 27 2022 11:27 AM | Updated on Oct 27 2022 11:39 AM

Mani Ratnam Ponniyin Selvan Locks This OTT Partner, Streaming on November - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. . కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందించి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇక మొదటి భాగంగా గత నెల సెప్టెంబర్‌ 30న తమిళ్‌, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పెద్దగా వసూళు చేయలేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పొన్నియన్‌ సెల్వన్‌ రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

చదవండి: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన నిర్మాత.. కారుతో భార్యను తొక్కించి..

ఇక థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుందని, నవంబర్‌ మొదటి, రెండు వారాల్లో పొన్నియన్‌ సెల్వన్‌ అందుబాటులోకి రానుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చియాన్‌ విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, జయం రవి, త్రిష, కార్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లతో పాటు మణిరత్నం కూడా నిర్మించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement