Kamal Kishore Mishra: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన నిర్మాత.. కారుతో భార్యను తొక్కించి..

FIR Lodged on Director Kamal Kishor Mishra For Hurting Wife with Car - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కమల్‌ కిశోర్‌ మిశ్రాపై కేసు నమోదైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న తన భార్యను కారుతో తొక్కించాడనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 10న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగావెలుగులోకి వచ్చింది. భర్త తనని చంపాలని చూశాడని కిశోర్‌ మిశ్రా భార్య అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

చదవండి: Samantha Shocking Look: సామ్‌ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి!

వివరాలు.. బాలీవుడ్‌ నిర్మాత అయిన కిశోర్‌ మిశ్రా మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అంధేరిలోని ఓ ఇంటి పార్కింగ్‌ స్థలంలో సదరు మహిళతో సన్నిహితంగా ఉండటం ఆయన భార్య కంటపడింది. ఇక ఈ విషయమై ఆయనను నిలదీసేందుకు ఆమె కారు దగ్గరికి వెళ్లింది. కారు దిగమని చెబుతున్న ఆయన డోరు తీయకపోవడంతో ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో కంగారు పడ్డ కిశోర్‌ మిశ్రా వెంటనే కారు స్టార్ట్‌ చేశాడు. ఈ క్రమంలో కారు ఆమెను ఢీకోట్టడంతో ఆమె కిందపడిపోయింది.

చదవండి: పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చిన బంగారం ఎంతో తెలుసా?

అయినా కిశోర్‌ మిశ్రా కారు ఆపకుండ భార్య కాళ్లపై నుంచి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆమె అరవడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి ఆమె కాపాడాడు. అయితే ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. భర్త తనను చంపాలని ప్రయత్నించాడని కిశోర్‌ మిశ్రా భార్య అంబోలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కిశోర్‌ మిశ్రాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top