మణిరత్నం మకాం మధ్యప్రదేశ్‌కు.. | Mani Ratnam To Go To Madhya Pradesh for shooting | Sakshi
Sakshi News home page

మణిరత్నం మకాం మధ్యప్రదేశ్‌కు..

Jun 5 2021 1:19 AM | Updated on Jun 5 2021 9:32 AM

Mani Ratnam To Go To Madhya Pradesh for shooting - Sakshi

త్వరలో మధ్యప్రదేశ్‌కు మకాం మార్చాలనుకుంటున్నారు దర్శకుడు మణిరత్నం.

త్వరలో మధ్యప్రదేశ్‌కు మకాం మార్చాలనుకుంటున్నారు దర్శకుడు మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్, మాండ్వా, మహేశ్వర్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను జరపాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యా రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు.. ఈ సన్నివేశాలకు భారీగా జూనియర్‌ ఆర్టిస్టులు కావాలట. ఇందుకోసం ఎక్కువగా అక్కడి స్థానికులను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement