Manchu Vishnu: మనోజ్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన విష్ణు

మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌కు పొసగడం లేదంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తూ మనోజ్ పెళ్లికి అతిథిలా వచ్చి వెళ్లాడు విష్ణు. తాజాగా మనోజ్ అనుచరులతో విష్ణు విష్ణు గొడవపడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. 'విష్ణు అన్న నా మనుషులను ఇలా కొడతాడు' అంటూ మనోజ్ ఓ వీడియో షేర్ చేయగా ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇంటి గుట్టు రచ్చకీడ్చారని ఆగ్రహించిన మోహన్‌బాబు వీడియో డిలీట్ చేయమని మనోజ్‌ను ఆదేశించాడు. తండ్రి ఆదేశించడంతో మనోజ్ వీడియో డిలీట్ చేశాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.
ఈ తరుణంలో మనోజ్ షేర్ చేసిన వీడియోపై మంచు విష్ణు స్పందించాడు. 'ఇది నిన్న జరిగిన చిన్న గొడవ. మా ఇద్దరి మధ్య ఇలాంటి చిన్నచిన్న గొడవలు సర్వసాధారణమే. సారధితో వాగ్వాదాన్ని ఆపలేదు. కానీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు. ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు. దీన్ని భూతద్దంలో చూడొద్దు. మావాడు ఏదో ఆవేశంలో పోస్ట్ చేశాడు' అని వివరణ ఇచ్చాడు. దీంతో విష్ణు-మనోజ్‌ల మధ్య వివాదాన్ని మంచు కుటుంబసభ్యులు లైట్ తీసుకున్నారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు