పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య | Manchu Manoj And Mounika Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Manchu Manoj: మరోసారి తాత అయిన మోహన్ బాబు.. పాప పేరేంటో తెలుసా?

Apr 13 2024 12:21 PM | Updated on Apr 13 2024 1:05 PM

Manchu Manoj And Mounika Blessed With Baby Girl - Sakshi

మంచు ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మనోజ్-మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది.

(ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్)

మనోజ్, మౌనిక.. గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశారు. అలానే సీమంతం కూడా చేశారు. ఇప్పుడు పాప పుట్టిన విషయాన్ని  బయటపెట్టారు.

ఇకపోతే మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మీ.. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలానే ధైరవ్ (మనోజ్ కొడుకు)కి చెల్లెలు వచ్చేసిందని లక్ష్మీ రాసుకొచ్చింది. చెప్పడం అయితే చెప్పారు గానీ పాపకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement