మంచువారింట ఐరా బర్త్‌డే సందడి | Manchu Ayra Vidya Turns One Year Today | Sakshi
Sakshi News home page

మంచువారింట ఐరా బర్త్‌డే సందడి

Aug 9 2020 8:50 PM | Updated on Aug 10 2020 12:52 PM

Manchu Ayra Vidya Turns One Year Today - Sakshi

మంచు విష్ణు ఐరానిక దంపతుల చిన్న కూమార్తె ఐరా విద్య మొదటి పుట్టినరోజు కావడంతో వారింట సందడి నెలకొంది. ఐరా పుట్టినరోజు సందర్భంగా విష్ణు ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘మా ఐరా ఈరోజుతో మొదటి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇదే నా పరివారం’అంటూ విష్ణు ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా విష్ణు ఐరానిక దంపతులకు నలుగురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌, ఐరా అన్న సంగతి తెలిసిందే. వీరిలో అరియానా, వివియానా కవలలు. సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్‌ మీడియాలో ఐరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 
(బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement