
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బహుకరించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సినీరంగంలో అందించే అత్యుత్తమ అవార్డ్ను ప్రకటించింది.
కాగా.. 1980లో సినిమాల్లో అడుగుపెట్టిన మోహన్ లాల్ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. మంజిల్ విరింజ పూక్కళ్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 45 ఏళ్ల తన సినీ కెరీర్‌లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మోహన్ లాల్.. కంప్లీట్ యాక్టర్ అనే పేరును సంపాదించుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటనతో ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Delhi: 71st National Film Awards | Dadasaheb Phalke Award recipient Actor Mohanlal says, "...This is not a dream come true. This is something far greater. It's magical. It's sacred..."
He says, "As a representative of the Malayalam film industry, I am deeply humbled to… pic.twitter.com/x1z6veIslh— ANI (@ANI) September 23, 2025