Why Mahesh Babu-Trivikram Movies Face Same Problem? - Sakshi
Sakshi News home page

Mahesh Babu Trivikram:‍ వీళ్ల కాంబోకే సమస్యలు.. ఎందుకిలా?

Jul 26 2023 1:51 PM | Updated on Jul 26 2023 1:58 PM

Mahesh Babu Trivikram All Movies Face Same Problem - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్‌ తప్పుకొన‍్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు.

త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్‌కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ‍్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి.

(ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!)

అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప‍్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్‌గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది.

మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. కాకపోతే అప‍్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

Advertisement
 
Advertisement
Advertisement